Rahul Gandhi, Revanth Reddy Launch Gig Workers Welfare Act
Telangana Chief Minister A. Revanth Reddy, along with Leader of the Opposition in the Lok Sabha Rahul Gandhi, on Saturday launched the state's social security and welfare policy for gig and platform workers, marking a major step towards strengthening their rights and social protection. The Chief Minister also inaugurated an online registration system for gig and platform workers and dedicated the Telangana Gig and Platform Workers Act to the people at a public event held at Jayabheri Grounds near Hyderabad's HITEC City, coinciding with the birth anniversary of India's first Prime Minister, Pandit Jawaharlal Nehru. Earlier, Revanth Reddy and Rahul Gandhi participated in a massive motorcycle rally from Shilparamam to Jayabheri Grounds, accompanied by ministers and thousands of gig workers.
తెలంగాణ రాష్ట్రంలో గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ విధానాన్ని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారితో కలిసి ఆవిష్కరించారు. గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల నమోదుకు ఆన్లైన్ విధాన్ని ప్రారంభించారు. ✅దేశ తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని జయభేరీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభా వేదిక నుంచి గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించిన చట్టాన్ని అంకితం చేశారు. ✅తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్డ్ #GigWorkers నిబంధనలపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమం ప్రారంభంలో దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకుని ఆ మహనీయుని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ✅అంతకుముందు శిల్పారామం నుంచి జయభేరీ గ్రౌండ్స్ వరకు చేపట్టిన భారీ బైక్ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, లోక్‌సభ విపక్ష నేత @RahulGandhi గారితో కలిసి పాల్గొన్నారు. ప్లాట్‌ఫామ్ కార్యకర్తల బైకులపై రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు, పలువురు మంత్రులు, గిగ్ వర్కర్లతో కలిసి బైక్ ర్యాలీగా జయభేరీ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. ✅ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ఇచ్చిన మాట ప్రకారం నెహ్రూ గారి జన్మదినం రోజున గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ చట్టాన్ని ప్రజలకు అంకితం చేశామని చెప్పారు. ఈ చట్టం నేటి నుంచి అమలులోకి వస్తుందన్నారు. ✅ఈ చట్టం వల్ల ప్రతి గిగ్ వర్కర్‌కు రూ. 5 లక్షల జీవిత బీమా సౌకర్యం లభిస్తుందని, ఆరోగ్య భద్రత కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల అందజేస్తున్నట్టు తెలిపారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా వర్కర్లకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డు లభిస్తుందని చెప్పారు. ✅గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ కోసం చట్టం రూపొందించడానికి ఐఐటీ లాంటి సంస్థలతో పాటు సామాజిక కార్యకర్త @nikhilmkss గారు ఏమీ ఆశించకుండా ఎంతో సహకారం అందించారని చెప్పారు. గిగ్ వర్కర్ల నాయకులు, నిపుణులతో అనేక సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ చట్టం రూపొందించామని తెలిపారు. ✅గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారు. విధుల్లో ఉండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు గిగ్ కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున సహాయాన్ని అందించారు. ✅ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు దామోదర రాజనర్సింహ గారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్లు పాల్గొన్నారు. #TelanganaGigWorkersPolicy #GigWorkersWelfare #Telangana
— Telangana CMO (@TelanganaCMO) November 14, 2026
Addressing the gathering, Revanth Reddy announced that the legislation would come into effect immediately, providing ₹5 lakh life insurance coverage and ₹10 lakh health insurance coverage through Rajiv Aarogyasri for every gig worker. He also announced the establishment of a dedicated welfare board and the issuance of special identity cards to registered workers. The Chief Minister said the legislation had been drafted following extensive consultations with gig workers' representatives and experts, with support from social activist Nikhil Dey and institutions such as IIT. Reaffirming his government's commitment to workers' welfare, he also handed over financial assistance of ₹5 lakh each to the families of two gig workers who lost their lives in accidents while on duty. Deputy Chief Minister Mallu Bhatti Vikramarka, several state ministers, MPs, MLAs, MLCs, senior officials and representatives of the gig workforce attended the event.