Telangana CM Revanth Reddy Greets Chukka Ramaiah on 100th Birthday
Recalling his association with Chukka Ramaiah and Professor Nageshwar, the Chief Minister expressed pride in having worked alongside them. He highlighted Ramaiah's role as a Member of the Legislative Council, where he consistently raised social and public issues, questioned the government and suggested solutions.
ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గారు శతవసంతాలు పూర్తి చేసుకుని కొత్త వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆయన నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ❇️చుక్కా రామయ్య గారి జన్మదినోత్సవం తెలంగాణ ప్రజలకు, విద్యా వ్యవస్థకు గొప్ప పర్వదినమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించారు. ❇️స్వాతంత్య్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన రామయ్య గారు ఐఐటీ అనే పదాన్ని ప్రజలకు, విద్యార్థులకు పరిచయం చేసిన గొప్ప విద్యావేత్త అని కొనియాడారు. విద్యావేత్తగానే కాకుండా శాసనమండలిలో సభ్యుడిగా కూడా ఈ ప్రాంతంపై తనదైన ముద్రను వేశారని అన్నారు. ❇️చుక్కా రామయ్య గారు, ప్రొ. నాగేశ్వర్ లాంటి వారితో కలిసి పనిచేశానని గుర్తుచేస్తూ ఆ విషయాన్ని తాను గొప్పగా చెప్పుకుంటానని, అదృష్టంగా భావిస్తానని అన్నారు. శాసనమండలిలో సామాజిక సమస్యలు, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా సమస్యలకు పరిష్కారం కూడా సూచించే వారని గుర్తుచేశారు. ❇️చుక్కా రామయ్య గారు శాసనమండలిలో ప్రస్తావన చేసేంత వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ కాలేజీ లేదన్న విషయం ఎవరికీ తెలియదని, వారు ప్రస్తావించిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. ❇️కాలానికి, రాజకీయాలకు చుక్కా రామయ్య లాంటి వారు అతీతులని, వారు ఆయురారోగ్యాలతో అందరికీ స్ఫూర్తినివ్వాలని ముఖ్యమంత్రి గారు కోరుకున్నారు. చుక్కా రామయ్య గారి ఆలోచనలు, సూచనలు, సలహాల మేరకు ప్రభుత్వం ముందుకు వెళుతోందని ముఖ్యమంత్రి అన్నారు. ❇️ముఖ్యమంత్రి గారితో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఎమ్మెల్సీ ప్రొ కోదండరాం గారు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, ప్రొ. హరగోపాల్ గారు, సీనియర్ జర్నలిస్టు రామచంద్రమూర్తి గారితో పాటు పలువురు ప్రముఖులు చుక్కా రామయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. #ChukkaRamaiah #TelanganaPride
— Telangana CMO (@TelanganaCMO) November 20, 2026
Revanth Reddy recalled that the absence of a degree college in the undivided Ranga Reddy district came to public attention after Ramaiah raised the issue in the Legislative Council, prompting the government to take a decision on the matter.
The Chief Minister expressed his hope that personalities like Chukka Ramaiah would continue to inspire future generations through their long lives, wisdom and contributions. He added that the Telangana government was moving forward in accordance with Ramaiah's ideas, suggestions and advice.
Several prominent personalities also joined the Chief Minister in extending birthday greetings to the veteran educationist. They included MP Anil Kumar Yadav, MLC Prof. Kodandaram, MLA Koonamneni Sambashiva Rao, Justice Sudarshan Reddy, Prof. Haragopal and senior journalist Ramachandramurthy, among other dignitaries.